ETV Bharat / asia-pacific

పసిడి గనిలో 60 ప్రాణాలు

ప్రమాదవశాత్తు బంగారు గని కూలి 60 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఇండోనేషియా సులవేశి ద్వీపంలో జరిగింది.

ఇండోనేషియా బంగారు గని ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు
author img

By

Published : Feb 27, 2019, 3:08 PM IST

ఇండోనేషియాలో అక్రమ బంగారు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. సులవేశి ద్వీపంలోని గని మంగళవారం ప్రమాదవశాత్తు కూలిపోవడం వల్ల సుమారు 60 మంది కార్మికులు సొరంగాల్లోనే చిక్కుకుపోయారు.

ఇండోనేషియా బంగారు గని ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు

గని ప్రదేశంలో అస్థిరంగా ఉన్న మట్టి వల్ల అక్కడ ఉన్న బోర్డులు, స్తంభాలు కూలిపోయాయి. కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బోలాంగ్​ మోంగోండో ప్రాంతంలో 15 మంది క్షతగాత్రులను, రెండు మృతదేహాలను వెలికితీశారు. మిగిలినవారు సజీవంగానే ఉన్నారని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

మట్టి వదులుగా ఉండడం వల్ల భారీ యంత్రాలు ఉపయోగించడానికి వీలు లేకుండాపోయింది. చిన్నచిన్న పరికరాలు, చేతులతోనే సహాయ చర్యలు చేపట్టాల్సి వస్తోంది.

ఇండోనేషియా ఇలాంటి అక్రమ బంగారు గనులు చాలా ఉన్నాయి. తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. 2016లో జాంబీ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించారు. 2015లో జావా ద్వీపంలో జరిగిన దుర్ఘటనలో 12 మంది మరణించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.