
చరవాణి ద్వారా చెల్లింపులు చేసి తమకు కావాల్సిన మొక్కల్ని తీసుకెళ్లవచ్చని బోర్డు పెట్టింది. ప్రతి మొక్క పైనా ధర నిర్దేశించి చరవాణి ద్వారా చెల్లింపులు చేసే వారికి 8.8 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. మొక్కల్నెవరూ చోరీ చేయకపోగా ఫిబ్రవరి 3-9 మధ్య 33 కొనుగోళ్లు జరిగి 1400 యువాన్లు(చైనా కరెన్సీ) సంపాదించినట్లు వెల్లడించింది. ఇది ఉన్నత వ్యక్తిత్వ లక్షణమని, నగర నైతికతకు నిదర్శనమని వాంగ్ తెలిపింది.
ఆ వారంలో కొనుగోలు చేసిన వారి కోసం 50 రకాల బహుమతుల్ని సిద్ధం చేసినట్లు వెల్లడించింది వాంగ్. అమ్మకందారులు లేకుండా షాపును నడపగలిగితే వారానికి రెండురోజులు సెలవులు తీసుకుంటానని, ప్రత్యేక డిస్కౌంట్లూ ప్రకటిస్తానని తెలిపింది.