చైనాలో అరుదైన పౌర్ణమి (సూపర్ మూన్) కనువిందు చేసింది. సాధారణ పరిమాణం కంటే పెద్దగా, ఎక్కువ ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిచ్చాడు.
లూనార్ న్యూ ఇయర్ తర్వాత 15వ రోజు జరుపుకునే లాంతరు పండుగ (దీపాల పండుగ)రోజునే ఈ పౌర్ణమి సంభవించటం మరో విశేషం. దీంతో చైనా ప్రజలు ఈ అరుదైన దృశ్యాలను తమ చరవాణీల్లో బంధించేందుకు పోటీ పడ్డారు.
ఫిబ్రవరిలో సంభవించే ఈ పౌర్ణమిని 'మంచు చంద్రడు' గా కూడా చైనీయులు పిలుచుకుంటారు. ఇలా సరిగ్గా లాంతరు పండుగనాడే చంద్రుడు పెద్దగా కనిపించటం అరుదుగా జరుగుతుందని నిపుణులు తెలిపారు. 21 వ దశాబ్దంలో 1,241 సార్లు ఫుల్ మూన్ ఏర్పడితే అందులో 38 సార్లు మాత్రమే ఈ పండుగ రోజున సంభవించింది.
సూపర్ మూన్‌కి కారణం:
⦁ చంద్రునిపైన అత్యంత చల్లని ప్రదేశం భూ కక్షకు సమీపించటం.
⦁ చంద్రునిపై పూర్తిగా సూర్య ప్రకాశం పడటం వల్ల ఈ సూపర్ మూన్ ఏర్పడింది.