చైనాలోని మంగోలియా ప్రాంతంలోని ఓ గనిలో జరిగిన బస్సు ప్రమాదంలో 21మంది మృతి చెందారు. మరో 29మందికి గాయాలయ్యాయి. కార్మికులను తీసుకుని భూగర్భంలోకి వెళుతున్న బస్సు... గనిగోడల్ని ఢీకొట్టింది.
ఘటనా స్థలికి చేరుకున్న చైనా అత్యవసర విభాగం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల చైనాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్ పేలుళ్లు, భూగర్భ వరదలు, గని కూలిన ప్రమాదాల్లో మృత్యువాత పడేవారిలో ఎక్కువగా కార్మికులే ఉంటున్నారు.