రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సాహసక్రీడలంటే అమితమైన ప్రేమ. ఆ ఇష్టంతోనే అప్పుడప్పుడు సందడి చేస్తుంటారాయన. ప్రస్తుతం సోచిలో ఉన్న పుతిన్ అక్కడ కొద్దిసేపు సరదాగా జుడో ఆడారు. రష్యా ఛాంపియన్లతో సమరానికి సై అన్నారు.
2014 శీతకాల ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన సోచిలోని శిక్షణా శిబిరంలో జాతీయ జట్టు ఆటగాళ్లతో తలబడ్డారు పుతిన్. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.
సోచీలోనే నిన్న పుతిన్... మంచులో స్కీయింగ్ చేస్తూ కెమెరా కంటబడ్డారు. ఇప్పుడిలా జుడో ఆడారు.