చరిత్ర తెలుసుకోవడానికి పుస్తకాలు, సినిమాలే ప్రధాన మార్గం. ఇప్పుడు వాటికి మరొకటి తోడైంది. అదే కాంతి ప్రదర్శన. పురాతన విశేషాలను దృశ్య రూపంలో చూపి ప్రత్యక్ష అనుభూతిని పొందేలా చేస్తోంది అధునాతన సాంకేతికత.
దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఒకప్పుడు 'గర్-నహ్' తెగకు చెందిన ప్రజలు జీవించేవారు. వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, అప్పటి జంతు సమూహాల గురించి తెలుసుకునేందుకు కాంతి ప్రదర్శన నిర్వహిస్తున్నాయి యెల్లేకా డ్యాన్స్, క్రియేటివ్ లైట్స్ సంస్థలు. ఈ ప్రదర్శన పేరే 'యబర్రా'.
ఇందులో కాంతి, ధ్వనుల పరస్పర అంశాలను జోడించి 'గర్-నహ్' ప్రజల జీవనశైలిని కళ్లకుగడుతున్నారు.
"ఇక్కడ మేము చీకట్లో కాంతిని పంచుతాము. కాంతి ద్వారా కథలు పంచుకోవాలనేది నా ఆశ. దీని వల్ల అందరికీ ఈ ప్రాంతం గురించి అర్థమవుతుంది. ముఖ్యంగా మా ప్రజలకు దీనికి సంబంధించిన గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అవగాహన వస్తుంది."
-కార్ల్ టెల్ఫర్, యబర్రా సృష్టికర్త
ఏటా నెల రోజుల పాటు జరిగే అడిలైడ్ ఫ్రింజ్ ఉత్సవాలు ఈ నెల 16న ప్రారంభమయ్యాయి. 2019 మార్చి 17 వరకు కొనసాగనున్నాయి.