"వంద గ్రాముల బరువున్న ఓ జీవి మనతో కలిసి బతకలేకపోతే... మనకింత సాంకేతికత ఎందుకు" తెలుగు సినిమా డైలాగ్‌లా అనిపించినా ఇది నిజం.. భూమిపై నివసించే సకశేరుకాల్లో(వెన్నెముక గల జంతువులు) 25శాతం మానవ తప్పిదం వల్ల మరణిస్తున్నాయని తాజా సర్వేలో తేలింది. వెయ్యికి పైగా నివేదికలను పరిశీలించి, 42వేల 755 జీవుల మరణాలను విశ్లేషించింది అమెరికా వ్యవసాయ విభాగం.
"35వేల జాతులున్న ఈ భూమండలంలో కేవలం ఓ వర్గానికి చెందిన మానవుల వల్లే ఇంత నష్టం సంభవిస్తోంది. దీనికి మనమందరం బాధ్యత వహించాల్సి ఉంది. పట్టణీకరణ వల్ల భూమిని మానవులు విపరీతంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది".
- జేరాల్డ్ ఎల్. బెలాండ్, నివేదిక సహరచయిత
మానవ తప్పిదం వల్ల కలిగే ప్రభావం జాతుల బట్టి మారుతోంది. చిన్న చిన్న జంతు జాతుల కన్నా పెద్ద వర్గాల జీవులే మారణ హోమానికి గురవుతున్నాయి.
-జాకోబ్ హిల్, సహరచయిత
మానవుల ప్రత్యక్ష చర్యల వల్ల 28శాతం మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయని ప్రపంచ జీవవారణ శాస్త్ర జర్నల్‌లో ప్రచురితమైంది. మిగిలిన 72 శాతం సహజమరణం పొందుతున్నాయి. జీవులు అంతరించపోవడానికి మానవుడే ప్రధాన కారకుడు అవుతున్నాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.