326 పవర్... కస్టమైజ్డ్ కార్ల తయారీలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. రిమ్‌లు, స్ట్రట్స్, సస్పెన్షన్స్, వీల్ ఛాంబర్ మార్పులు వంటి ఎన్నో పనులకు ఈ సంస్థ పెట్టింది పేరు. హిరోషిమా కేంద్రంగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమకు వ్యాపారలావాదేవీలు ఉన్నాయని అంటోంది. ఈ ఏడాది నాలుగు కార్లతో ప్రదర్శనకు వచ్చింది.
ఇలాంటి కస్టమైజేషన్ కార్లను కోరుకునేవారు చాలా దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఉదాహరణకు మా దగ్గర ఉన్న చాలా మంది వినియోగదారులు ఉన్నత స్థాయి వ్యక్తులు. వారు విభిన్నమైన కారు కావాలని కోరుకుంటారు.
- ఫుకుడా, 326 పవర్ తయారీదారుడు
ఏటా జనవరిలో జరిగే ఈ ఆటో సెలూన్ ఈ ఏడాది మరింత ఆకర్షణీయంగా ముగిసింది. చిన్న కంపెనీలూ ఈ ఏడు సందడి చేశాయి. తమ ఆవిష్కరణలను చూపించేందుకు పోటీ పడ్డాయి. నిస్సాన్ కంపెనీ జూక్ ఎస్యూవీ మోడల్‌తో అదరగొట్టింది. మంచుపైన ప్రయాణించే కారును ప్రదర్శనకు పెట్టింది.
మంచుపై జారుతూ విన్యాసాలు చేసే సమయంలో క్రాలర్ పద్ధతికి చక్రాలను జోడిస్తారు. ఇదే మాకు ప్రేరణగా నిలిచింది. అయితే జూక్ పద్ధతి ఆధారంగా, కాస్త మార్పులతో మరింత మెరుగ్గా తయారుచేశాం.
- యసుకగవా, నిస్సాన్ గ్లోబల్ కన్వర్షన్ అండ్ యాక్సెసరీ మేనేజర్
మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రదర్శనలో సుమారు 900 వాహనాలు, కార్ల సంబంధిత ఉత్పత్తులు కనువిందు చేశాయి. కళ్లు చెదిరే కస్టమైజ్డ్ కార్లతో 27వ వార్షికోత్సవ వేదికకు మరింత క్రేజ్ వచ్చింది. 426 ప్రదర్శనకారులు ఒకే వేదికగా తమ నూతన కస్టమైజ్ కార్లను సందర్శకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇది చాలా క్రేజీగా ఉంది. కాస్త మార్పులతో వెర్రెత్తించే ఎన్నో కార్లు ఇక్కడ ఉన్నాయి. కారు సామర్థ్యాన్ని అవి పెంచనప్పటికీ రెండు పెద్ద రెక్కలు, చక్రాల దగ్గర ఉన్న భారీ ఛాంబర్ నిజంగా చాలా బాగుంది.
- నిగెల్, సందర్శకుడు