విశ్వంలోని సౌర వ్యవస్థ, భూమిపై జీవి పుట్టుకను తెలుసుకునే పరిశోధనల్లో జపాన్ ముందడుగు వేసింది. సుదూరంలోని గ్రహశకలంపై మానవరహిత వ్యోమ నౌక(స్పేస్‌క్రాఫ్ట్)ను దించింది. గ్రహశకలం నమూనాలను సేకరించనుందీ నౌక. ప్రయోగం విజయవంతమైందని జపాన్ ఏయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ పేర్కొంది.
భూమి నుంచి 280 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని రియుగ్ అనే గ్రహశకలంపై హయాబుసా-2 అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది.