చంద్రుడిపై నీటి నిక్షేపాలున్నాయా? ఒకవేళ ఉంటే భవిష్యత్తులో మానవులు జాబిల్లిపై నివాసం ఉండొచ్చా? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది నాసా. చంద్రుని ఉపరితలం రసాయన కర్మాగారంగా పనిచేస్తోందని, అక్కడ ఉన్న పదార్థాలతో నీటిని తయారు చేయొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ కనుగొంది.
Could the Moon be a potential source of water production? 🤔 Solar wind streams protons to the Moon, which interacts w/ electrons to make hydrogen atoms. These atoms latch onto oxygen in the lunar soil — making hydroxl, a component of water. 🌊 Take a dip: https://t.co/Bl5C6r2Dia pic.twitter.com/HUPecxPhHy
— NASA (@NASA) February 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Could the Moon be a potential source of water production? 🤔 Solar wind streams protons to the Moon, which interacts w/ electrons to make hydrogen atoms. These atoms latch onto oxygen in the lunar soil — making hydroxl, a component of water. 🌊 Take a dip: https://t.co/Bl5C6r2Dia pic.twitter.com/HUPecxPhHy
— NASA (@NASA) February 20, 2019Could the Moon be a potential source of water production? 🤔 Solar wind streams protons to the Moon, which interacts w/ electrons to make hydrogen atoms. These atoms latch onto oxygen in the lunar soil — making hydroxl, a component of water. 🌊 Take a dip: https://t.co/Bl5C6r2Dia pic.twitter.com/HUPecxPhHy
— NASA (@NASA) February 20, 2019
ఎలా తయారు చేస్తారు?
సౌరశక్తి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినపుడు జరిగే రసాయన చర్యలతో నీటిని ఉత్పత్తి చేయొచ్చని కంప్యూటర్ ప్రోగ్రామ్ సాయంతో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. సెకనుకు 450 కిలోమీటర్ల వేగంతో సౌరగాలి చంద్రుడి ఉపరితలాన్ని తాకితేనే ఇది సాధ్యమవుతుందని పరిశోధకులు తేల్చారు.
సౌర పవనాలు చంద్రుడిపై ప్రోటాన్స్గా మారతాయి. తర్వాత ఎలక్ట్రాన్స్‌తో సంయోగం చెంది... చంద్రుడిపై హైడ్రోజన్ అణువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ పరమాణువులు చంద్రుని ఉపరితలంపై యథేచ్ఛగా కదులుతాయి. సిలికా(SiO2) సమక్షంలో ఆక్సిజన్‌తో కలుస్తాయి. జాబిల్లి ఉపరితలాన్ని నీటి ఉత్పత్తికి అనుగుణంగా తయారుచేస్తాయి.
ఈ మొత్తం విధానం రసాయన చర్యలతో ఓ కర్మాగారాన్ని తలపిస్తుంది. హైడ్రోజన్, ఆక్సిజన్‌తో సమ్మిళితమై హైడ్రాక్సైల్(OH)గా రూపాంతరం చెంది నీటిని సృష్టిస్తుంది.ఈ విశ్వంలో నీరు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి రాయిలోనూ నీటిని తాయారు చేయగల గుణం ఉంటుంది"
--విలియమ్ ఫారెల్, నాసా శాస్త్రవేత్త
ఎలా కనుగొన్నారు?
చంద్రుడి నుంచి విడుదలైన కాంతిని అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. హైడ్రోజన్, హైడ్రాక్సైల్ ఆనవాళ్లు గుర్తించారు. చంద్రుడిపై హైడ్రోజన్ పరమాణువుల జీవిత చక్రాన్ని అంచనా వేశారు. జాబిల్లిపై ఈ పరమాణువులు ఎలా ప్రవర్తిస్తాయో లెక్కగట్టారు.
చంద్రుడిని మనుషులకు నివాస స్థలంగా మార్చాలనేది నాసా లక్ష్యం. తాజా అధ్యయన ఫలితాల ఆధారంగా చంద్రుడిపై నీటి లభ్యతకు సంబంధించి మరిన్ని ప్రయోగాలకు ఆ సంస్థ సిద్ధమైంది.