న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎక్కేందుకు అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి గాబ్రియెల్ గోరెన్స్టెకు అమెరికా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గత సంవత్సరం ఒక మహిళ ఈ విగ్రహాన్ని ఎక్కిన కేసులో ఆయనే కొద్దిరోజుల్లో తీర్పునివ్వనున్నారు.
న్యూయార్క్‌కు చెందిన థెరెసే ప్యాట్రిసియా ఓకోమో అనే మహిళ ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై నిరసన వ్యక్తం చేయటానికి గతేడాది జులై 4న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పునాది వరకు ఎక్కింది. ఈ కేసులో ఆమె నేరం చేసినట్లు రుజువైంది.
తుది తీర్పునివ్వటానికి ముందు ఆమె చేసిన తప్పు వల్ల కలిగిన ఇబ్బందుల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని నిర్ణయించారు న్యాయమూర్తి. విగ్రహాన్ని ఎక్కేందుకు నిశ్చయించుకున్నారు. ప్రభుత్వాన్ని అనుమతి కోరగా, సమ్మతించింది.