ఈ నెల 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని దాడిని తీవ్రంగా ఖండించింది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం. సోమవారం జరిగిన ఎదురుకాల్పులు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
అణ్వాయుధ సంపత్తి కలిగిన రెండు దేశాల మధ్య సఖ్యత పెంపొందాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచ్లెట్ ఆకాంక్షించారు. ఉద్రిక్త వాతావరణాన్ని పెంపొందించుకోవద్దని భారత్, పాక్ దేశాలకు సూచించారు.
భారత్లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కశ్మీరీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు బాచ్లెట్. ఈ విషయమై హోంమత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కశ్మీర్ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయొద్దని పిలుపునిచ్చారు.