అమెరికా-చైనా వాణిజ్య చర్చలు చాలా సానుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇరుదేశాల మధ్య నాలుగు రోజులుగా చర్చలు కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి కనబడడంలేదు.
....productive talks, I will be delaying the U.S. increase in tariffs now scheduled for March 1. Assuming both sides make additional progress, we will be planning a Summit for President Xi and myself, at Mar-a-Lago, to conclude an agreement. A very good weekend for U.S. & China!
— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">....productive talks, I will be delaying the U.S. increase in tariffs now scheduled for March 1. Assuming both sides make additional progress, we will be planning a Summit for President Xi and myself, at Mar-a-Lago, to conclude an agreement. A very good weekend for U.S. & China!
— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2019....productive talks, I will be delaying the U.S. increase in tariffs now scheduled for March 1. Assuming both sides make additional progress, we will be planning a Summit for President Xi and myself, at Mar-a-Lago, to conclude an agreement. A very good weekend for U.S. & China!
— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2019
ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపోరు వల్ల ట్రంప్ చైనా దిగుమతులపై 200 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం నుంచి ఈ పన్నులు అమలవుతాయి. ఈలోపుగానే చర్చలు ఫలవంతం కావడానికి చైనా-అమెరికా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఎలాంటి పురోగతి కనిపించకపోవడం వల్ల చర్చలను శుక్రవారం నుంచి ఆదివారం వరకు పొడిగించారు.
చర్చల్లో పురోగతి సాధిస్తే, చైనా దిగుమతులపై సుంకాలు పెంచడానికి నిర్దేశించిన గడువును వెనక్కు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో పాటు ఇరుదేశాల ద్రవ్య (కరెన్సీ) వినిమయంపై కూడా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు.
అలాగే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో త్వరలోనే భేటీ కావాలని ట్రంప్ చూస్తున్నారు. బహుశా వచ్చే నెలలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది.
శుక్రవారం చైనా ఉపాధ్యక్షుడు లియు హ్యూతో సమావేశమైన ట్రంప్ చర్చల పురోగతిపై ఆశాభావం వ్యక్తం చేశారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం చర్చలు ఫలవంతమవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనకరంగా 'విన్-విన్' స్ఫూర్తితో విజయం సాధించాలని అభిలషించారు.
వియత్నాం హనోయ్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో తన భేటీకి జిన్‌పింగ్ ఎంతో సహకరించారని ట్రంప్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.