ఉత్తరకొరియాతో శాంతికి ప్రయత్నించినందుకు తనకు నోబెల్ ఇవ్వాలంటూ జపాన్ ప్రధాని షింజో అబే ప్రతిపాదించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఆ బహుమతి తనకు ఎప్పటికీ ఇవ్వరని తనపై తానే వ్యంగంగా స్పందించారు ట్రంప్.
ఉత్తర కొరియాతో యుద్ధానికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అధ్యక్షుడు ఒబామా ఒకసారి తనతో అన్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఆయనకు మాత్రం నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని, అసలు ఎందుకిచ్చారో ఇప్పటికీ ఒబామాకు కూడా తెలియదని ఛలోక్తులు విసిరారు.
మనం చాలా మంచి పనులు చేశామని, వాటికి గుర్తింపు అవసరంలేదని తన పాలకవర్గంతో ట్రంప్ అన్నారు.