అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య రెండో రోజు భేటీ ప్రారంభమైంది. వియత్నాం హనోయి వేదికగా జరుగుతున్న చర్చలు ఫలప్రదమవుతాయని ఇరు దేశాధినేతలు భావిస్తున్నారు.
అణు ఒప్పందానికి నాకేమీ తొందర లేదు. చర్చల ద్వారా అర్థవంతమైన ఫలితం వస్తుంది. అత్యుత్తమ ఫలితాలు దీర్ఘకాలంలో మాత్రమే వస్తాయి. - ట్రంప్
మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా- కిమ్
గతంలో జరిగిన సింగపూర్ సమావేశంలో అణ్వాయుధాల పరీక్షల నిలిపివేత పై పాక్షిక ప్రకటన మాత్రమే వెలువడింది. హనోయి సమావేశంలో సంపూర్ణ ప్రకటన వస్తుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.
ఉదయాన్నే ప్రారంభమైన భేటీ మధ్యహ్నం వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇరు దేశాధినేతలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశముంది.