ETV Bharat / america

భోజనం చేయకుండానే.!

పెద్దగా ఫలితం తేలకుండానే హనోయి చర్చలు ముగిసాయి. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయకుండానే భేటీ ముగించారు ఇరు దేశాధినేతలు.

ట్రంప్​-కిమ్
author img

By

Published : Feb 28, 2019, 1:48 PM IST

Updated : Feb 28, 2019, 4:00 PM IST

అణ్వాయుధ పరీక్షల నిలిపివేతపై వియత్నాం రాజధాని హనోయిలో అమెరికా-ఉత్తర కొరియా మధ్య జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు. ఇరు దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్​-కిమ్​ జోంగ్​ ఉన్​ల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు.

ఇరు దేశాల మధ్య నిర్మాణత్మక చర్చలు జరిగాయి. పలు కీలక అంశాలపై నేతలు సంభాషించారు. అణ్వాయుధాల నిరోధం, ఉత్తర కొరియా దేశ ఆర్థిక అభివృద్ధి గురించి భేటీలో చర్చించారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఒప్పందం జరగలేదు. భవిష్యత్​ సమావేశంలో అర్థవంతమైన ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాం- సారా సాండర్స్​, శ్వేతసౌధం మీడియా కార్యదర్శి.

సింగపూర్​లో జరిగిన చర్చలకు కొనసాగింపుగా హనోయి సమావేశం జరిగింది. కానీ ఎలాంటి పురోగతి లేకుండానే భేటీ ముగిసింది.

ముందస్తుగానే..

ట్రంప్​-కిమ్​ సమావేశం అనుకున్న సమయం కంటే ముందుగానే ముగిసింది. షెడ్యూల్​ ప్రకారం భేటీ అనంతరం వారు మధ్యాహ్న భోజనానికి హాజరుకావాల్సి ఉంది. కానీ భేటీ ముందుగానే ముగిసి భోజనం చేయకుండానే వెనుదిరిగారు ఇరువురు నేతలు. దీంతో అతిథులతో కళకళలాడాల్సిన డైనింగ్​ టేబుళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.

చిరునవ్వే సమాధానం

సమావేశ అనంతరం చిరునవ్వుతోనే వెనుదిరిగారు ట్రంప్​. హనోయి భేటీతో రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధం ఏర్పడింది, కానీ ఒప్పందం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని ట్రంప్​ ప్రకటించారు. ఇరు దేశాధినేతల భేటీకి ముందు "అణు ఒప్పందంలో తనకు తొందరేమీ లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు​.

సజావుగానే సమావేశం

హనోయి సమావేశంలో ఇరు దేశాధినేతలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. విలేకర్ల ముందు కూడా ఇరువురు నేతలు చమత్కరించుకున్నారు. విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్​లో అమెరికా అనుసంధాన కార్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు తెలిపారు కిమ్​.

undefined
ట్రంప్​-కిమ్​ చర్చలు విఫలం

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2019, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.