పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఈ ఆత్మాహుతి దాడి భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమయిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుందని ట్రంప్ విశ్లేషించారు.
ఘటన గురించి విన్నాను. నివేదికలు అందాయి. సరైన సమయం వచ్చినప్పుడు దీనిపై స్పందిస్తా. వారు (భారత్- పాకిస్థాన్) కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇది భయంకరమైన ఉగ్రదాడి. పూర్తి నివేదిక అందగానే ప్రకటన విడుదల చేస్తా.- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
"బాధితులకు కేవలం సంతాపం మాత్రమే కాదు,మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. విచారణకు పాక్ సహకరించాలి. దాడికి బాధ్యులైన వారిని శిక్షించాలి. ఈ విషయంలో అమెరికా మద్దతు ఉంటుంది" అని చెప్పారు అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి పలడినో.
భారత్‌కు ఆత్మ రక్షణ కోసం దాడులు చేసే అధికారం ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అన్నారు. జైష్- ఏ - మహమ్మద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, బోల్టన్ , శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా సాండర్స్ పాక్‌ను డిమాండ్ చేశారు.