భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణ చర్యలు చేపట్టాలనిఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. పుల్వామా దాడి రెండు దేశాల మధ్య వాతావారణాన్ని మరింత వేడెక్కించిందని అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాలు చర్చలకు ముందుకొస్తే ఐరాస ఎల్లప్పడూ వేదికవడానికి సిద్ధమేనని ఆంటోనియో స్పష్టం చేశారు.
భారత్-పాక్ మధ్య సంబంధాలను పుల్వామా దాడి మరింత బలహీనపరిచింది. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జావాన్లు వీరమరణం పొందారు.
పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ 'జైష్ ఏ మహమ్మద్' ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఈ ఘటన అనంతరం ఇరు దేశాలు తమ రాయబారులను పిలిపించుకొని పరిస్థితులను సమీక్షించాయి.