మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయంతో దేశంలో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గోడ నిర్మాణం కోసం కోరిన నిధులకు కాంగ్రెస్ అంగీకరించకపోవడం వల్ల గత శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ట్రంప్. దీనితో గోడ నిర్మాణం కోసం బిలియన్ డాలర్లు మళ్లించుకోవచ్చు.
సరిహద్దులో గోడ నిర్మాణం.. జాతీయ భద్రతకు అవసరమనేది ట్రంప్ వాదన. కానీ ట్రంప్ నిర్ణయాలు సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని 16 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.