బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో కొత్త రకం సాంకేతికత టెక్ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సంజ్ఞల ద్వారా నియంత్రించే ఫోన్ను సామ్సంగ్ కొన్ని సంవత్సరాలు క్రితమే రూపొందించినా ఆ మోడల్ విఫలమైంది. ఇప్పుడు ఎల్జీ ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది.
రెండు కొత్త మోడళ్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ప్రదర్శించింది ఈ దక్షిణ కొరియా కంపెనీ. అవి ఎల్జీ వీ50 థింక్ - 5జీ మొబైల్, రెండు తెరలుగా ఉంటుంది. ఎల్జీ జీ8 -గెశ్చర్ సదుపాయంతో పాటు మీ అరచేతి ద్వారా ఫోన్ లాక్ చేసుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్ సంస్థ హోలోలెన్స్ 2 అనే సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించనుంది. ఈ హెడ్సెట్ పెట్టుకుంటే కళ్ల ముందు ఆగ్మెంటెడ్ మిక్స్డ్ రియాలటీతో చిత్రాలన్ని కనిపిస్తాయి. దీంతో పెద్ద పెద్ద నిర్మాణాలు ఎలా నిర్మిస్తారు, మానవుడి శరీరంలో అవయవాల పనితీరు ఎలా ఉంది అనేది మనకు వర్చువల్ రియాలిటీలో కనిపిస్తుంది.
దీని ధర 3500 డాలర్లు ఉండనుంది. ఈ వరల్డ్ మొబైల్ కాంగ్రెస్.. ఫిబ్రవరి 28 వరకు జరగనుంది.