నేను ఇంటర్నెట్, గేమింగ్‌కు బానిసనయ్యాను. ఇదొక డిజిటల్ ప్రేరేపణ. వీడియో గేమ్స్, వెబ్సైట్లు నా రోజువారీ జీవితాన్ని తిరిగి నేను అదుపు చేసుకోవాల్సినంత తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
- టెక్ బాధితుడు
టెక్నాలజీకి తాను ఎంతగా బానిసైపోయాడో వివరిస్తున్నాడు ఈ 27ఏళ్ల యువకుడు. వృత్తిపరంగా టెక్ సంబంధిత పరిశ్రమలో పనిచేస్తు న్నాడు. సాంకేతికత ప్రతికూలతలు గురించి మాట్లాడితే ఎక్కడ తన ఉపాధికే నష్టం జరుగుతుందోనని భయపడుతున్నాడు.
ఇప్పుడు నేను ఈ ప్రత్యేక యాప్‌ను వాడుతున్నాను. దీనికి ఉన్న ఫిల్టర్ ఆప్షన్‌తో నేను ఏ వెబ్‌సైట్‌ను చూడాలో, దేన్ని చూడకూడదో చెప్తుంది. నా స్పాన్సర్‌కు సైతం ఈ వెబ్సైట్ల జాబితాను పంపుతుంది.
- టెక్ బాధితుడు
సియాటెల్ పట్టణం ఉన్నత సాంకేతికతకు ప్రధాన కేంద్రంగా మారింది. మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలకు నివాసమైన ఈ నగరం ఇప్పుడు టెక్ వ్యసనపరులుగా మారిన వారికి సహాయం అందించే ఆవాసంగా మారింది. ఈ ప్రాంతంలో ప్రత్యేక కౌన్సిలర్లు పుట్టుకొచ్చారు. 12 దఫాలుగా చికిత్స అందించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
సాంకేతికత రోజురోజుకు మరింత ఆధునికమవుతోంది. అది యువతను ఎక్కువగా ప్రేరేపిస్తోంది. చిన్న వయసులోనే పిల్లలకు ఫోన్లు, డిజిటల్ పరికరాలను తల్లిదండ్రులు అందిస్తున్నారు.
- హిలరీ కాష్, రీస్టార్ట్ లైఫ్ సెంటర్ వ్యవస్థాపకురాలు.
వాషింగ్టన్‌లోని రీస్టార్ట్ లైఫ్ అనే పునరావాస కేంద్రం దశాబ్దం క్రితం ఏర్పాటైంది. టెక్ బానిసలుగా మారిన యువత ఇక్కడికి వస్తుంటారు.
దీని వల్ల సమస్యలు అధికమవుతున్నాయి. నిద్రలేమితో పగలు, పనివేళల్లో లేనిపోని భ్రమలకు గురవుతున్నారు. ఒంటరితనం, విద్యాభ్యాసం మానేయడం, కుంగుబాటు వీరిలో తీవ్రంగా కనిపిస్తోంది.
- హిలరీ కాష్, రీస్టార్ట్ లైఫ్ సెంటర్ వ్యవస్థాపకురాలు.
ఈ 27ఏళ్ల యువకుడు వీడియో గేమ్స్‌కు బానిసయ్యాడు. ఇప్పుడు కుంగుబాటు, కంగారు వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్నెట్ అండ్ టెక్ అడిక్షన్ అనే సంస్థ నుంచి చికిత్స తీసుకుంటున్నాడు.
చివరగా ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. నలుగురిలో కలిసిపోయి ఏ పనైనా చేయాలని అనుకుంటాను. నాకు సహాయం కావాలి. ఈ విషయంపై నా స్పాన్సర్తోనూ వారానికి ఒక్కసారైనా మాట్లాడుతూ ఉంటాను.
- టెక్ బాధితుడు
ప్రపంచ వ్యాప్తంగా 9శాతం యువత వీడియో గేమ్స్‌కు వ్యసనపరులయ్యారని అమెరికన్ అకాడమి అఫ్ పిడియాట్రిక్స్ సమీక్షలో తేలింది. ఈ గేమింగ్ డిజార్డర్‌ను కొద్ది నెలల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము గుర్తించిన వ్యసనాల జాబితాలో చేర్చింది.