ETV Bharat / america

"కిమ్​కు బాగా తెలుసు" - Kim jong Un

ఈనెల 27నుంచి కిమ్​తో జరగనున్న భేటీపై ట్రంప్ స్పందించారు. ఉత్తర కొరియా ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా అవతరించగలిగే అవకాశముందన్నారు ట్రంప్.

"కిమ్​కు బాగా తెలుసు"
author img

By

Published : Feb 25, 2019, 4:03 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​, ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ రెండోసారి హనోయ్ వేదికగా భేటీ కానున్నారు. ఈ నెల 27 నుంచి రెండు రోజులపాటు జరగనున్న ఈ​ సమావేశంపై ట్రంప్​ స్పందించారు. అణ్వాయుధాలను పూర్తిగా త్యజిస్తే... ఉత్తర కొరియా ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా అవతరించే అవకాశముందని ప్రకటించారు. అణుపరీక్షలు కొనసాగిస్తే మాత్రం ఆర్థిక శక్తిగా ఎప్పటికీ మారలేదని ట్రంప్​ స్పష్టం చేశారు.

గతేడాది జూన్​లో జరిగిన సింగపూర్​ భేటీ అంశాల పురోగతిపై చర్చించేందుకు ఇరువురు నేతలు ఎదురుచూస్తున్నామని తెలిపారు.

  • Chairman Kim realizes, perhaps better than anyone else, that without nuclear weapons, his country could fast become one of the great economic powers anywhere in the World. Because of its location and people (and him), it has more potential for rapid growth than any other nation!

    — Donald J. Trump (@realDonaldTrump) February 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆర్థిక శక్తిగా అవతరించడానికి ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఎంతో అనువైన దేశం. అందరికంటే ఈ విషయం కిమ్​కే బాగా తెలుసు. చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాల మధ్య అద్భుతమైన ప్రదేశంలో ఉత్తర కొరియా ఉంది. ఈ దేశం లేకుండా మిగతా మూడు దేశాలు ఒకదానికొకటి కలుసుకోలేవు. స్థిరాస్తి రంగ వ్యాపారుడినైనందున నేను ఇలాంటి ప్రదేశాల్లో వ్యాపారం బాగా చేశాను. అందుకే ప్రపంచంలో గొప్ప ఆర్థిక దేశంగా అవతరించగలిగే అవకాశం ఉత్తర కొరియాకుంది. అణు పరీక్షలు కొనసాగిస్తే మాత్రం మీరు ఆ అవకాశాన్ని కోల్పోతారని కిమ్​కు స్పష్టం చేస్తున్నా."

- డోనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

undefined

మొదటి భేటీ ఒప్పందాలు ఎంతవరకు అమలయ్యాయని విమర్శలు

కిమ్​-ట్రంప్​ మరోసారి భేటీ కానున్న నేపథ్యంలో... ఇరుదేశాధినేతలు సింగపూర్​ సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఎంత వరకు అమలయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు. అణునిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించినా... ఎంతవరకు ఆచరించిందన్న సందేహం అలాగే ఉందని ఆరోపిస్తున్నారు.

అణునిరాయుధీకరణపై ఇరుదేశాలు గతంలో ఒప్పందం చేసుకున్నప్పటికీ... ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

- స్టీఫెన్​ బీగన్​, ఉత్తర కొరియాకు అమెరికా ప్రత్యేక ప్రతినిధి

అణునిరాయుధీకరణ దిశగా ఇరుదేశాధినేతలు హనోయ్​లో అయినా ముందడుగేయాలి. సమావేశంలో ఇరుదేశాలకు ఎలాంటి ఫలితం దక్కకపోతే... ఈ భేటీ కూడా సమయాన్ని వృథా చేయటం లాంటిదే.

- హార్రీ కజియానిస్​, నేషనల్​ ఇంటరెస్ట్​ మ్యాగజైన్​ సంపాదకీయుడు

ఉత్తర కొరియా మాత్రం అణు నిరాయుధీకరణ దిశగా అడుగులేస్తున్నామని చెబుతోంది. దాదాపు ఏడాది కాలంగా బాలిస్టిక్​ మిస్సైల్స్​, అణ్వాయుధాలను పరీక్షించలేదని చెబుతోంది.

చకచకా ఏర్పాట్లు

వియత్నాం రాజధాని హనోయ్​లో ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు ట్రంప్​-కిమ్​ సమావేశం జరగనుంది. ఈ భేటీ నేపథ్యంలో అధికారులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.

అణు నిరాయుధీకరణ ఒప్పందం, దక్షిణ కొరియాలో... అమెరికా బలగాలు మోహరించటంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

New Delhi, Feb 25 (ANI): The Oscar for an actor in the leading role went to Rami Malek for his portrayal of Queen frontman Freddie Mercury in the film 'Bohemian Rhapsody.' On his speech Malek said, ''I may not have been the obvious choice, but I guess it worked out, the fact that I'm celebrating him and this story with you tonight is proof that we're longing for stories like this''. The actor beat Christian Bale, Bradley Cooper, Viggo Mortensen and Willem Dafoe for the coveted award.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.