హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతి రద్దు కోసం ప్రస్తుత నిబంధనావళిలో చేయాల్సిన మార్పులపై ప్రతిపాదనలను అమెరికా అంతర్గత భద్రతా శాఖ-డీహెచ్ఎస్ శ్వేతసౌధానికి అధికారికంగా సమర్పించింది. ఈ మార్పులు జరిగితే... 90వేల మందికిపైగా హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాములపై ప్రభావం పడనుంది. ఇందులో భారతీయ మహిళలే అధికం.
డీహెచ్ఎస్ ప్రతిపాదనలపై డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం వేర్వేరు సంస్థల నుంచి శ్వేతసౌధం అభిప్రాయాలు సేకరించనుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు కొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది. ఉద్యోగ అనుమతి విధానం రద్దుకు ట్రంప్ సర్కారు నిర్ణయిస్తే... డీహెచ్ఎస్ ఆ అంశంపై అధికారిక ప్రకటన చేయనుంది.
ఇదీ చూడండి: టైపు రైటర్లు ఇంకా ఉన్నారు..!
ఏంటీ హెచ్4?
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారి జీవితభాగస్వాములు ఉద్యోగం చేసేందుకు హెచ్4-ఈఏడీ నిబంధనతో అనుమతి లభిస్తోంది. బరాక్ ఒబామా హయాంలో తెచ్చిన ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అంతర్గత భద్రతా శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది.
రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమం
హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతి విధానం రద్దు ప్రతిపాదనలను సెనెటర్ కమలా హారిస్ సహా దిగ్గజ సంస్థల సారథులు వ్యతిరేకిస్తున్నారు. నిబంధనలు మార్చితే వేలాది కుటుంబాలపై ప్రభావం పడడమే కాక... అమెరికాకు నిపుణులు రాకుండా ఆగిపోయే ప్రమాదముందన్నది వారి వాదన.
This is outrageous & will force immigrant women who are doctors, nurses, scientists & academics, among others, to abandon their professional careers. I called on DHS last year to withdraw this proposal & will continue to fight this. https://t.co/7zYY8ZGxuk
— Kamala Harris (@SenKamalaHarris) February 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is outrageous & will force immigrant women who are doctors, nurses, scientists & academics, among others, to abandon their professional careers. I called on DHS last year to withdraw this proposal & will continue to fight this. https://t.co/7zYY8ZGxuk
— Kamala Harris (@SenKamalaHarris) February 22, 2019This is outrageous & will force immigrant women who are doctors, nurses, scientists & academics, among others, to abandon their professional careers. I called on DHS last year to withdraw this proposal & will continue to fight this. https://t.co/7zYY8ZGxuk
— Kamala Harris (@SenKamalaHarris) February 22, 2019
హెచ్4 వ్యవహారంపై ఇప్పటికే కొలంబియా అపీళ్ల కోర్టులో ఓ కేసు నడుస్తోంది. ఒబామా తెచ్చిన నిబంధనతో అమెరికన్లు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారంటూ 'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' స్వచ్ఛంద సంస్థ న్యాయపోరాటానికి దిగింది. ప్రస్తుతం ఈ కేసుపై భారతీయ అమెరికన్ శ్రీ శ్రీనివాసన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.
హెచ్4 వీసాదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయాన్ని డీహెచ్ఎస్ కోర్టుకు నివేదించి, అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది.