ETV Bharat / america

పడవలే దిక్కు

కాలిఫోర్నియా వరదలకు పలు పట్టణాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు ద్వీపాలను తలపిస్తున్నాయి.

author img

By

Published : Feb 28, 2019, 3:24 PM IST

పడవలే దిక్కు

అమెరికాలోని కాలిఫోర్నియాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తర శాన్​ఫ్రాన్సిస్కోలోని ఓ పట్టణం జలమయమైంది. పడవలతోనే స్థానికులు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు వరదల ప్రభావానికి నిర్మానుష్యంగా మారాయి. నీటితో మునిగిపోయిన ప్రాంతాలు చిన్న చిన్న ద్వీపాలను తలపిస్తున్నాయి. రష్యన్​ నది సమీపంలోని 4వేల 500 మంది నిర్వాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

"నివాసాల్లోకి నీరు వచ్చి చేరడాన్ని గమనించాం. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని అప్పుడు మాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు సహాయక సిబ్బంది ఎవరూ లేరు. ప్రమాద హెచ్చరికలూ జారీ చేయలేదు."
--- జేక్​ రాండ్​, వ్యాపారవేత్త.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.