ఈజిప్టు రాజధాని కైరోలో సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి అదుపుతప్పి ఓ రైలు దూసుకొచ్చింది. ప్రమాదంలో డీజిల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగాయి. స్టేషన్లోని కొంత భాగం కాలిపోయింది. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మరో 47 మంది గాయపడ్డారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కైరో రైల్రోడ్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
భద్రత విషయంలో ఈజిప్టు రైల్వే శాఖ చాలా వెనకబడింది. దశాబ్దాలుగా నిర్వహణ లోపాలతో అనేక ప్రమాదాలు జరిగాయి. 2017లోనే 1793 ప్రమాదాలు జరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.