" రామ్డ్ ఎర్త్ అనేది పురాతన సాంకేతికతే. ఘనాలో చాలా వరకు మట్టితోనే అధిక శాతం ఇళ్లు నిర్మితమవుతాయి. ఆ పద్ధతిని మారుస్తున్నాం. ఎర్రమట్టిని మిశ్రమంగా తయారు చేస్తున్నాం. మట్టి, కొంత బురద, ఇసుక, కొన్ని కంకర రాళ్లు ఈ మిశ్రమంలో ఉంటాయి. మిశ్రమాన్ని గోడలా నిలబడేందుకు చెక్కతో తాత్కాలిక అడ్డుగోడ కడతాం. ఎనిమిది అంగుళాల వెడల్పు ఉన్న ఆ నిర్మాణాన్ని మట్టితో నింపాక నాలుగు అడుగులకు కుదిస్తాం. ఇది గట్టి రాయిలా తయారవుతుంది. ఇది మనుషులు తయారు చేసే రాయి."
-- క్వామ్డీ హీర్, సహ యజమాని, హైవ్ ఎర్త్
సాధారణంగా నిర్మించే ఇళ్ల కన్నా వీటి నిర్మాణ వ్యయం తక్కువ. రామ్డ్ఎర్త్ ఇళ్లలోకి ధ్వని అధికంగా రాదు. చెదలు పట్టవు. గది ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఎందుకంటే గోడలు చాలా మందంగా ఉంటాయి. ఇవి భూకంపాలనూ తట్టుకోగలవని చెబుతున్నారు హీర్. ఇటుకలతో కట్టిన ఇళ్ల కన్నా ఇవి ఎక్కువ దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. చైనాగోడ కూడా రామ్డ్ఎర్త్ పద్ధతిలోనే కట్టారు.
"వందల ఏళ్ల సంప్రదాయ పద్ధతిలో సామాగ్రిని ఉపయోగించి ఘనా ప్రజలు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఈ పద్ధతులను మేం మరువం. 150 నుంచి 200 ఏళ్ల నాటి మట్టి ఇళ్లు ఇంకా శిథిలమవకుండా ఉన్నాయని మా పరిశోధనలో తేలింది. అవి ఇంకా దృఢంగా ఉన్నాయి. "
-- విలియమ్స్ నిమాలియో, ఇంజినీర్