తన పనితీరుతో అందరినీ మెప్పిస్తోంది. చుట్టుపక్కల కొత్త కారు ఎవరుకొన్నా కిమిండా దగ్గరకే వస్తారు.
కార్లలో ఆడియో, వీడియో, బ్లూటూత్-టెలిఫోన్ సిస్టమ్‌ను అలవోకగా అర్థం చేసుకోగలరు కిమిండా.
"ఇక్కడకు వచ్చిన ప్రతి కస్టమర్ నేను అమర్చిన మ్యూజిక్ సిస్టమ్ బాగుందని చెప్తారు. నా పనితీరును మెచ్చుకుంటారు. సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేసి ఇక్కడకి వచ్చేలా చేస్తారు. నేను వృద్ధురాలినని తెలిసి.. ఈ పని చేసేది నిజంగా నేనేనా కాదా అని నిర్ధరించుకునేందుకు కొందరు వస్తుంటారు."- -కిమిండా
ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ ఈ పని నుంచి విరమించబోనని తెలిపింది కిమిండా. తనతో పాటు మరో 13 మందికి ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
తన మనవడి ఇంజనీరింగ్ కోర్సు పుస్తకాలను చదివి సౌండ్ సిస్టమ్‌పై పూర్తి అవగాహన పొందింది 80ఏళ్ల సిసిలియా వరంగి కిమిండా.