పీఓకేలో భారత దాడులు చేసిన రెండో రోజే స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. దాడుల నేపథ్యంలో మంగళవారం భారీగా పతనమైన దేశీయ మార్కెట్లు త్వరగా పుంజుకున్నాయి. 288 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 36వేల 262 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 76 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 10వేల 911 వద్ద ట్రేడవుతోంది.
ట్రంప్-కిమ్ భేటీతో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సమావేశం నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ఫలితంగా విదేశీ నిధులతో పాటు దేశీయ ముదుపరులు కూడా సానుకూలంగా స్పందించటం భారత మార్కెట్లకు కలిసొచ్చింది.
స్టాక్ మార్కెట్లు కోలుకోవటంతో రూపాయి కూడా ఆరు పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 71.01 వద్ద కొనసాగుతోంది.
ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగాలు, ఎఫ్ఎంసీజీ, ఆరోగ్యసేవలు తదితరాలు 1.32 శాతం మేర లాభపడ్డాయి.
ఆసియాలోనూ...
హాంకాంగ్ 0.44 శాతం, జపాన్ నిక్కీ 0.53 శాతం, షాంఘై 0.79 శాతం, కొరియా 0.24 శాతం లాభాలు గడించాయి.