స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 341.90 పాయింట్లు లాభపడి 36,213.38 వద్ద ముగియగా జాతీయ మార్కెట్ సూచీ నిఫ్టీ 88.45 పాయింట్లు పెరిగి 10,880.10 వద్ద ముగిసింది.
అమెరికా కస్టమ్స్ సుంకాల పెంపును నిలిపివేయడం, నిర్మాణంలో ఉన్న భవనాలపై పన్ను 5 శాతం తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో సూచీలు లాభాలవైపు పరుగులు తీశాయి.
లాభపడిన షేర్లు...
యెస్ బ్యాంకు, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు లాభాల్ని ఆర్జించాయి.
నష్టపోయిన షేర్లు...
కోల్ ఇండియా, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ షేర్లు నష్టాలతో ముగిశాయి.
ఇదీ చూడండి:హాజరు కావాల్సిందే