ETV Bharat / markets

నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు - rupee

స్టాక్​ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజూ నష్టాల్లో ముగిశాయి.

నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Feb 18, 2019, 7:05 PM IST

స్టాక్​ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజూ నష్టాల్లో ముగిశాయి. సోమవారం సెన్సెక్స్​ 311 పాయింట్లు నష్టపోయి 35,498కి పడిపోయింది. నిఫ్టీ 83 పాయింట్లు క్షీణించి 10,640 వద్ద స్థిరపడింది.

ఈ వారం పబ్లిక్​, ప్రైవేటు బ్యాంకుల ప్రధాన అధికారులతో సమావేశయ్యాక రుణగ్రహీతల వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని రిజర్వు బ్యాంకు గవర్నర్​ శక్తికాంత దాస్​ ప్రకటనతో బ్యాంకింగ్​ షేర్లు బలహీనపడ్డాయి.

టీసీఎస్​, యస్​బ్యాంక్​, ఐసీఐసీఐ, సన్​ఫార్మా, రిలయన్స్​, కోల్​ ఇండియా, ఏసియన్ పెయింట్స్​ షేర్లు 2.91శాతం నష్టాలను చవిచూశాయి.

ఓఎన్​జీసీ, టాటా మోటార్స్​, వేదాంతా, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు 1.48 లాభాలను అర్జించాయి.
టెలికాం, రియల్టీ షేర్లు 0.88 శాతం వృద్ధి సాధించాయి.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 966.43కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లను విక్రయించారు.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 71.44గా ఉంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.