ఆసియా మార్కెట్లలో సానుకూలత వల్ల స్టాక్‌మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. షేర్ల కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపిస్తుండడం వల్ల మార్కెట్లకు మరింత ఊపు వచ్చింది.
బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్-సెన్సెక్స్ 269.24 పాయింట్ల వృద్ధి చెంది 35,621.85 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ జోరు కొనసాగిస్తూ 74పాయింట్లు బలపడింది. 10,678 పాయింట్ల వద్ద ఉంది.
లాభాలు.. నష్టాలు
సెన్సెక్స్‌లో ఓఎన్జీసీ, వేదాంత, ఎస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెస్ సంస్థలు దాదాపు 2.12 శాతం లాభపడ్డాయి.
హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం షేర్లు 0.76శాతం పడిపోయాయి.
చైనా-అమెరికా మధ్య చర్చలు, ఆసియా మార్కెట్లలో సానుకూలత కారణంగా మదుపర్లు షేర్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
ట్రంప్ ప్రకటనతో...
చైనాతో చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన వల్ల.. అంతర్జాతీయ మార్కెట్లలోనూ జోష్ కనిపిస్తోంది.
ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. బ్యారెల్ ధర 66.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.