గత సెషన్లో భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు నేడు కోలుకున్నాయి. మదుపర్లు షేర్ల కొనుగోలుకు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానూకూల ప్రభావం కారణంగా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 162 పాయింట్లు వృద్ధి చెంది 35,660.65 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 38.90 పాయింట్లు బలపడి 10,679.85 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ సోమవారం 311 పాయింట్లు నష్టపోయింది.
లాభనష్టాలు స్వల్పమే..
భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్స్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, బజాజ్ ఆటో, వేదాంత, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకుల షేర్లు దాదాపు 1.45 శాతం లాభపడ్డాయి.
హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంకుల షేర్లు 0.76శాతం మేర నష్టపోయాయి.
చర్చలతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొలిక్కివస్తుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.
ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దేశీయ కరెన్సీ మార్కెట్లకు నేడు సెలవు.