తమ ప్రేమను తెలియజేసేందుకు వారం రోజుల ముందు నుంచే లవర్స్ ఆలోచిస్తుంటారు. టెడ్డీబేర్ ఇస్తే బాగుంటుందా? ఖరీదైన గ్రీటింగ్ కార్డు ఇద్దామా...? లేదంటే స్విస్ చాక్లెట్ల బాక్స్ ఇస్తే ఎలా ఉంటుందో అని హైరానా పడతారు. వీటన్నింటితో లాభపడేది మాత్రం గిఫ్టు షాపుల వాళ్లు మాత్రమే.
- 18వ శతాబ్దాపు మధ్య కాలం నుంచి ఇంగ్లండ్‌లో ప్రేమికుల రోజుకు ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. ప్రేమించిన వారికి స్వీట్ బాక్స్‌తో పాటు ప్రేమ లేఖ, ఎర్ర గులాబీలు రిబ్బన్‌తో కట్టి పంపేవారు. తర్వాత కాలంలో చేతిరాత ప్రేమ లేఖల నుంచి గ్రీటింగ్ కార్డులకు మళ్లారు.
- 1913లో కాన్సాస్ పట్టణంలోని హాల్‌మార్క్ కార్డ్స్ అనే సంస్థ పెద్ద మొత్తంలో ప్రేమికుల దినోత్సవ గ్రీటింగ్ కార్డులను ఉత్పత్తి చేసింది. రోజులు మారుతున్న కొద్ది ప్రేమ రూపు రేఖలు మారిపోయాయి. పక్కా బిజినెస్ అయిపోయింది.
గ్రీటింగ్ కార్డుల నుంచి గోల్డ్ రింగ్‌ల వరకు వచ్చింది. తమకు నచ్చినవారికి ఎంత ఖరీదైన బహుమతి ఇస్తే అంత ప్రేముంటుందనే భ్రమనే వ్యాపారులకు వరంగా మారింది. ఒకరు ఖరీదైన వాచ్ ఇస్తే మరొకరు బ్రాండెడ్ డ్రెస్, ఇంకొకరు గోల్డ్ రింగ్ ఇలా కాస్ట్లీ గిఫ్ట్‌లు కొనడం ప్రారంభమైంది. అందుకే షాపుల వాళ్లు వాలంటైన్ డే స్పెషల్ డిస్కౌంట్లు అంటూ ప్రేమికులను ఊరిస్తున్నారు.