పాకిస్థాన్ పై భారత్ వాయుసేన దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయోనన్న ఆందోళనలతో మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 343 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా,నిఫ్టీ 111 పాయింట్లు క్షీణతతో ప్రారంభమైంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 344 పాయింట్ల నష్టంతో 35,873 వద్ద ట్రేడవుతుండగా,నిఫ్టీ 90 పాయింట్ల క్షీణతతో 10,872 వద్ద ట్రేడవుతుంది.
సూచీల పతనానికి కారణాలివే:
- పాక్ పై భారత వాయుసేన దాడులతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.
- ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడంతో దేశీయ సూచీలు వాటినే అనుసరించాయి.
లాభాల్లో ఉన్నవి:
- బ్యాంకింగ్ రంగ షేర్లు ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి. - యస్ బ్యాంక్,ఐసీఐసీఐ,ఎస్బీఐ,కోటక్
- సన్ ఫార్మా,మారుతీ,టీసీఎస్
రూపాయి మళ్లీ పతనం:
నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి భారీగా పతనమైంది.33 పైసలు పతనమైన రూపాయి మారకపు విలువ 71 రూపాయిల 30 పైసల వద్ద ఉంది.