ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 48,239 కోట్ల మూలధన సహాయం చేస్తామన్న ఆర్థికశాఖ ప్రకటనతో... ఆ రంగ షేర్లు భారీ లాభాలను గడించాయి.
కార్పొరేషన్ బ్యాంకు 19.02 శాతం, యూసీఓ బ్యాంకు 8.75 శాతం, యునైటెడ్ బ్యాంకు 7.19 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 6.78 శాతం, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా 5.50 శాతం ఎగబాకాయి.
అలహాబాద్ బ్యాంకు 5.34శాతం, ఆంధ్రాబ్యాంకు 5.22శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 3.96 శాతం, సిండికేట్ బ్యాంకు 3.59 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 2.95 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.80 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.83 శాతం పెరిగాయి.
మూలధన సహాయం..
ఈ విడతతో మొత్తం మూలధన సహాయం రూ. 1,00,958 కోట్లకు చేరుతుంది. మొత్తం లక్ష్యం రూ. 1.06 లక్షలు.
ఈ విడతతో కార్పొరేషన్ బ్యాంకు అత్యధికంగా రూ. 9,086 కోట్ల వరకు పొందనుండగా... రూ.6,896 కోట్లతో అలహాబాద్ బ్యాంకు తదుపరి స్థానంలో ఉంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 4,638 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మాహారాష్ట్ర రూ. 205 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 5,908, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 4,112 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ. 3,256 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ. 1,603 కోట్లు పొందనున్నాయి.
తక్షణ దిద్దుబాటు చర్య కింద ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు మొత్తం రూ. 12,535 కోట్లు అందించనుంది.