ETV Bharat / economy

స్టార్టప్​లకు ఊతం

స్టార్టప్​ అర్థాన్ని సడలించిన కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల వరకు ఏంజెల్​ పన్నులో రాయితీని ప్రకటించింది.

author img

By

Published : Feb 20, 2019, 12:26 AM IST

స్టార్టప్​లకు ఊతం

కేంద్ర ప్రభుత్వం స్టార్టప్​ సంస్థలకు ఊతమిచ్చే చర్యలు చేపట్టింది. స్టార్టప్​ అర్థాన్ని సడలించి మొత్తం పెట్టుబడి 25 కోట్ల వరకు ఉన్నట్లయితే ఏంజెల్​ పన్నులో పూర్తి రాయితీ కల్పించింది. ఈ పరిమితి ఇప్పటివరకు రూ. 10 కోట్ల వరకు మాత్రమే ఉండేది.

స్టార్టప్​లు తీసుకునే ప్రైవేటు పెట్టుబడులే ఏంజెల్​ నిధులు. వీటికి తగ్గ ఈక్విటీ షేర్లను స్టారప్​లు పెట్టుబడిదారులకు అందిస్తాయి. ఏంజెల్​ నిధులపై ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 56(2)(viib) ప్రకారం ఏంజెల్​ పన్ను విధిస్తోంది. దీన్ని తాజాగా సవరించారు.

ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల వరకు ఆదాయం సంపాదించిన వాటిని స్టార్టప్​లుగా పరిగణిస్తారు. దీన్ని 100 కోట్లకు మార్చారు.

అర్హత ఉన్న స్టార్టప్​లలో ప్రవాసులు, క్యాటగిరి-1లోని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకూ 25 కోట్ల వరకు రాయితీ కల్పించారు.

100 కోట్ల నికర విలువ, 250 కోట్ల ఆదాయం ఉన్న ఏదైనా లిస్టెడ్​​ కంపెనీ... అర్హత ఉన్న స్టార్టప్​లో పెట్టుబడులు పెట్టినట్లయితే 25 కోట్ల కంటే ఎక్కువగా పన్ను రాయితీ పొందటానికి వీలుంటుంది. అంతే కాకుండా భారత పారిశ్రామిక విభాగం గుర్తించిన కంపెనీకి చెందిన వ్యాపార వేత్త స్పెసిఫైడ్​ అసెట్​ క్లాసెస్​లో పెట్టుబడి పెట్టనట్లయితే రాయితీ పొందవచ్చు.

స్థిరాస్తి, ట్రాన్స్​పోర్ట్​ వాహనాలపై 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా..... ఇతరులకు రుణాలివ్వటం, వేరే సంస్థలకు మూలధనం అందించటం, సాధారణ వ్యాపారానికి సంబంధించినవి కాకుండా ఇతర ఆస్తులలో పెట్టుబడులు పెట్టినట్లయితే... సెక్షన్​ 56(2)(viib) కింద మినహాయింపు పొందటానికి అనర్హులవుతారు.

undefined

ఈ రాయితీలు, మినహాయింపులు పొందటానికి స్టార్టప్​లు... సంతకం చేసిన డిక్లరేషన్​ సమర్పిస్తే సరిపోతుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మినహాయింపు, రాయితీ ఉత్తర్వులను ప్రత్యక్ష పన్నుల బోర్డుకు పంపించనుంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.