లిక్విడిటీ పెంపు సహా పలు అంశాలపై రిజర్వు బ్యాంకుకు ప్రభుత్వం చేసిన డిమాండ్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. సంస్థల కంటే దేశం ముఖ్యమని జైట్లీ ఉద్ఘాటించారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో తమ ప్రభుత్వం ఎన్నికవ్వాలని ఆకాంక్షించారు.
ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే ప్రభుత్వం మారకూడదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వ్యాపార సదస్సులో ప్రసంగిస్తూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు గవర్నర్లు రాజీనామా చేసినప్పటికీ నాటి ఆర్థిక మంత్రి చిదంబరం వారితో చర్చంచలేదని జైట్లీ విమర్శించారు.
దేశం ఆర్థిక క్రమశిక్షణను చూసింది. ప్రస్తుతం భారత్కు రాజకీయ స్థిరత్వం కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైంది దేశానికి ఆరు నెలల తాత్కాలిక ప్రభుత్వం కాదు ఐదేళ్లు పాలించే ప్రభుత్వం కావాలని జైట్లీ మహాకూటమిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఐదేళ్లలో తమ ప్రభుత్వం పన్నులను సక్రమంగా వసూలు చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేసినట్లు జైట్లీ వెల్లడించారు.