ప్రస్తుత ఆర్థిక ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.55 శాతంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల మంది పీఎఫ్ చందాదార్లు 8.55 శాతం వడ్డీని లబ్ధిపొందారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర వడ్డీ రేట్లను నేడు జరిగే ఉద్యోగుల భవిష్య నిధి ధర్మకర్తల సమావేశం ఖరారు చేయనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆశించినంత ఆదాయం రాలేదు. లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో పీఎఫ్ వడ్డీ రేట్లు పెంపునకే ఎక్కువ ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పీఎఫ్ డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ అత్యన్నత నిర్ణయాధికార బృందమైన కేంద్ర ధర్మకర్తల బోర్డు (సీబీటీ) తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లను కార్మిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సీబీటీనే తుది నిర్ణయం తీసుకుంటుంది.
గతంతో పోలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఐదేళ్ల కనిష్ఠ స్థాయి వడ్డీ రేటు (8.55 శాతం)ను నిర్ణయించింది.
గత ఐదేళ్లలో పీఎఫ్ వడ్డీ రేట్లు ఇలా ...
ఆర్థిక సంవత్సరం | వడ్డీ రేటు |
2016-17 | 8.65% |
2015-16 | 8.80% |
2014-15 | 8.75% |
2013-14 | 8.75% |
2012-13 | 8.50% |
నేటి సమావేశంలో కొత్త ఫండ్ మేనేజర్ల నియమకంపై ప్రకటన, స్టాక్ మార్కెట్లలో సంస్థ పెట్టుబడులను సమీక్షించనున్నారు.