డిసెంబర్లో 2.11 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 2.05 శాతానికి తగ్గింది. కూరగాయలు, గుడ్ల ధరలతో పాటు ఆహార పదార్థాల ధరల తగ్గుదల దీనికి దోహాదపడింది. కేంద్ర గణాంక కార్యాలయం జనవరి నెలకు సంబంధించి విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి.
జనవరి 2018లో ఈ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా ఉంది. 2018 డిసెంబర్లో 2.19 శాతంగా ఉన్న వినియోగదారు ద్రవ్యోల్బణం సవరించిన అంచనాల ప్రకారం 2.11 శాతానికి తగ్గింది. డిసెంబర్లో 4.54 శాతంగా ఉన్న ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పడిపోయింది.
ద్రవ్య పరపతి విధాన సమీక్షకు రిటైల్ ద్రవ్యోల్బణాన్నే రిజర్వు బ్యాంకు ఆధారంగా తీసుకుంటుంది. గత త్రైమాసిక ద్రవ్యోల్బణ అంచనాలను 2.8 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.