ఎన్నో యాప్స్ విపణిలోకి వచ్చినా... వాటి నుంచి పోటీ ఎదుర్కొంటూ ప్రజల మన్ననలతో పదేళ్లుగా దిగ్విజయ యాత్ర కొనసాగిస్తోంది వాట్సాప్. రోజూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా... చరవాణిల్లో నుంచి బయటకు వెళ్లకుండా నెటిజన్లకు తోడు, సహాయం అందించడంలో సఫలమయ్యాడు ఈ వాట్సాప్ వీరుడు.
We're back 👋 and today we're celebrating our 10 year anniversary! Stay tuned for more. #10YearsofWhatsApp pic.twitter.com/mSDnRRUivi
— WhatsApp Inc. (@WhatsApp) February 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">We're back 👋 and today we're celebrating our 10 year anniversary! Stay tuned for more. #10YearsofWhatsApp pic.twitter.com/mSDnRRUivi
— WhatsApp Inc. (@WhatsApp) February 25, 2019We're back 👋 and today we're celebrating our 10 year anniversary! Stay tuned for more. #10YearsofWhatsApp pic.twitter.com/mSDnRRUivi
— WhatsApp Inc. (@WhatsApp) February 25, 2019
- సం'దేశం' మారింది:
ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయాలంటే ఎస్ఎమ్ఎస్ పంపేవారు. దాని విషయంలో కొన్ని పరిమితులు ఉండేవి. ఇప్పుటికీ వందకు మించి పంపే సదుపాయం లేదు. అప్పుడే సాంకేతికత విజృంభిస్తున్న సమయంలో విలువైన డాటాను తక్కువగా వాడుతూ... ఎంత సమాచారాన్ని అయినా దేశంలో ఎక్కడికైనా పంపే అవకాశాన్ని కల్పించింది ఈ టాప్ యాప్.
ప్రకటనలే లేని యాప్:
ప్రపంచంలోనే ఎక్కువ మంది యూజర్లు ఉండి తక్షణ సందేశాన్ని పంపుకొనే వెసులుబాటు ఉన్న యాప్‌గా రికార్డు సృష్టించింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని వినియోగదారులను ఆకర్షించింది. ఇంత వ్యాపారం, కస్టమర్లను పెంచుకున్నా ప్రకటనల జోలికి పోకుండా ఉచితంగా ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తోంది.
ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్:
ప్రస్తుత కాలంలో ప్రజలు సాంకేతికత వాడుతుంటే ఏం కోరుకుంటున్నారు? వ్యక్తిగత సమాచారానికి గోప్యత, భద్రతతో పాటు సాంకేతికతతో మరిన్ని సేవలు అందించడం. ఈ సౌలభ్యాలను ఉచితంగా ఇస్తే ఆదరించకుండా ఉంటారా చెప్పండి.
ఈ ఎన్క్రిప్షన్ టెక్నిక్ ద్వారా సమాచార గోప్యతను కాపాడుతోంది. అందుకే ఇప్పటికీ వాట్సాప్ మీద సమాచార దుర్వినియోగం వంటి అభియోగాలు నమోదు కాలేదు.
- ఎన్క్రిప్షన్ అంటే.... ఇద్దరి మధ్య సమాచార మార్పిడి జరిగినపుడు హ్యాకర్లుగా పిలిచే మూడో వ్యక్తులు ఆ సందేశాలను తస్కరించే అవకాశాన్ని ఇవ్వకుండా చేస్తోంది. ఇలాంటి ఎన్క్రిప్షన్ టెక్నిక్‌ల వల్ల సమాచార దుర్వినియోగానికి పాల్పడటం సంస్థకే సాధ్యం కాదంటూ భరోసానూ కల్పించింది.
వీడియో అండ్ వాయిస్ కాలింగ్:
సమాచార వ్యవస్థ మార్పు చెంది సందేశాలు అక్షరాల్లోనే కాకుండా వీడియో, ఆడియో వంటి సదుపాయల్లోనూ అందించింది. ఇటీవల గ్రూప్ కాలింగ్ ( బృందంగా చర్చించుకోవడం) వంటి వెసులుబాటును కల్పించింది.
వాట్సాప్ స్టేటస్:
స్నాప్ చాట్‌తో మొదలైన ఈ స్టేటస్ విప్లవం... ఇన్‌స్టాలో 24గంటల పాటు తాత్కాలికంగా మన భావోద్వేగాలు పంచుకునేందుకు అవకాశం ఉండేది. దీన్నే వాట్సాప్ అందిపుచ్చుకొని స్టేటస్‌లతో పాటు లింకులు, పిక్చర్లు, వీడియోలనూ షేర్ చేసేలా మార్పులు చేసింది.
బిజినెస్:
చిన్నపాటి వ్యాపారాలు, లావాదేవీలు చేసుకునేందుకు బిజినెస్ సదుపాయం కల్పించింది. వినియోగదారులు, వ్యాపారులకు మధ్య మధ్యవర్తిగా పనిచేస్తోంది. ఆఫర్లు, వస్తువులు, సేవల వివరాలు ప్రజలు తెలుసుకునే సదుపాయం ఏర్పాటు చేసింది. వీటికి ట్రాకింగ్ ఫీచర్‌నూ జతచేసి ఔరా అనిపించుకుంది.
- చెల్లింపులు:
చెల్లింపులు చేయాలంటే బ్యాంకుల్లో గంటల తరబడి ఎదురుచూపులు. బ్యాంకు నంబర్లతో నగదు చలామణి సమయంతో కూడుకున్న పని. వాటికి పరిష్కారంగా గతేడాదే యూపీఐ విధానంలో చెల్లింపులు చేసేందుకు తొలి అడుగువేసింది. ఫోన్ నంబర్ల ద్వారా సులభంగా నగదు చలామణి చేసుకోవచ్చు. చెల్లింపుల కోసం వేరే యాప్ మీద ఆధారపడకుండా వినియోగదారులను కట్టిపడేసింది.
డిలీట్ మెసేజ్‌లు:
ఇతరులకు ఏదైనా సందేశం తప్పుగా పంపినపుడు దాన్ని తొలగించాలంటే అవకాశం ఉండేది కాదు. కానీ అలాంటి అత్యాధునిక ఫీచర్‌ను అందించి ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. ఇది తొలుత ఇన్‌స్టాలో ఉన్నా పెద్దగా ప్రజాదరణ పొందలేదు. దానికే కొన్ని మార్పులు చేసి కొంత సమయంలో మెసేజ్‌ను తొలగించే ఆప్షన్‌నూ తీసుకొచ్చింది. మొదట ఈ ఫీచర్ 7 నిముషాలకే పరిమితం అయితా... ప్రస్తుతం 1గంట 7నిముషాల వరకు డిలీట్ ఆప్షన్ పనిచేసేలా మార్పులు చేసింది.
ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట:
WhatsApp Web: https://t.co/BPQLxqKDSj - Firefox and Opera browsers are now supported! pic.twitter.com/D4aQiy5IC6
— WhatsApp Inc. (@WhatsApp) February 25, 2015 " class="align-text-top noRightClick twitterSection" data="
">WhatsApp Web: https://t.co/BPQLxqKDSj - Firefox and Opera browsers are now supported! pic.twitter.com/D4aQiy5IC6
— WhatsApp Inc. (@WhatsApp) February 25, 2015WhatsApp Web: https://t.co/BPQLxqKDSj - Firefox and Opera browsers are now supported! pic.twitter.com/D4aQiy5IC6
— WhatsApp Inc. (@WhatsApp) February 25, 2015
- ఇన్ని సదుపాయాలతో పాటు తక్కువ డాటా వినియోగం, సిగ్నల్ సరిగ్గా అందకపోయినా తక్కువ బ్యాండ్‌విడ్త్ ఉపయోగించుకొని సేవలు అందించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థిరపరుచుకుంది వాట్సాప్.