టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వేచి చూసిన మడతపెట్టే ఫోన్‌ను దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ సామ్సంగ్ ఆవిష్కరించింది. అలాగే గెలాక్సీ ఎస్ 10 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. తొలి 5జీ మోడల్‌ను పరిచయం చేసింది.
చూస్తే 4.6, తెరిస్తే 7.3
మడతపెట్టే ఫోన్‌ను ఫోల్డ్ అని పేరుతో విడుదల చేసింది సామ్సంగ్. చూడడానికి 4.6 అంగుళాలతో సాధారణంగా కనిపించే ఈ చరవాణి... మడత విప్పగానే 7.3 అంగుళాల టాబ్లెట్‌గా మారుతుంది.
ఏప్రిల్ 26 నుంచి..
మడత ఫోన్ ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి రానుంది. ధర 1,980 డాలర్లుగా(భారత కరెన్సీలో లక్ష నలభై వేల రూపాయలు) నిర్ణయించారు. ఈ ఫోన్ రాకతో ప్రత్యర్థి సంస్థ ఆపిల్‌కు గట్టి పోటీ ఇచ్చినట్లైంది.
ఒకేసారి మూడు యాప్స్
టాబ్లెట్ మోడ్‌లో ఒకేసారి మూడు యాప్స్‌ను వాడొచ్చని సామ్సంగ్ సంస్థ ప్రతినిధి జస్టిన్ డెన్సిన్ తెలిపారు. వైర్లెస్ ఛార్జింగ్ మరో ప్రత్యేకత. డిజిటల్ అసిస్టెంట్ 'బిక్సిబి' ఈఫోన్లలో ఉండనుంది. దీంతో అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ అధిపత్యాన్ని కొంతమేర అడ్డుకున్నట్లే.
సామ్సంగ్ ఫోల్డ్ స్పెసిఫికేషన్లు..
- డైనమిక్ సూపర్ అమోల్డ్ తెర
- 12 జీబీ ర్యామ్, 512 జీబీ అంతర్గత మోమొరీ, 4జీ నెట్వర్క్
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టాకోర్ ప్రాసెసర్
- 16,12,12 ఎంపీల మూడు వెనుక కెమెరాలు...
- 10, 8ఎంపీల ముందు కెమెరా
- 4,380 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్, వైర్లెస్ చార్జింగ్
గెలాక్సీ ఎస్ 10.. మూడు ఫోన్లు విడుదల
As expected, it’s not cheap, but the #GalaxyFold will still be THE device for gadget lovers... #Unpacked2019 Starting just under $2,000 and available ion April 26 pic.twitter.com/dmIHH6TWWY
— Bob O'Donnell (@bobodtech) February 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">As expected, it’s not cheap, but the #GalaxyFold will still be THE device for gadget lovers... #Unpacked2019 Starting just under $2,000 and available ion April 26 pic.twitter.com/dmIHH6TWWY
— Bob O'Donnell (@bobodtech) February 20, 2019As expected, it’s not cheap, but the #GalaxyFold will still be THE device for gadget lovers... #Unpacked2019 Starting just under $2,000 and available ion April 26 pic.twitter.com/dmIHH6TWWY
— Bob O'Donnell (@bobodtech) February 20, 2019
గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేసింది సామ్సంగ్. గెలాక్సీ ఎస్10, గెలాక్సీ ఎస్10 ప్లస్, గెలాక్సీ ఎస్10ఈ పేర్లతో ఆవిష్కరించింది.
గెలాక్సీ ఎస్ 10
- 6.1 అంగుళాల క్వాడ్హెచ్డీ ఇన్ఫినిటీ తెర
- 7ఎన్ఎం క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ , డ్యుయల్ సిమ్
- 8జీబీ ర్యామ్, 128, 512 జీబీల అంతర్గత మెమరీ సామర్థ్యం
- 12,12,16 మెగాపిక్సెళ్ల మూడు వెనుక కెమెరాలు
- 10ఎంపీ ముందు కెమెరా
- 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ చార్జింగ్ సదుపాయం
- ఇన్డిస్ల్పే ఫింగర్ ప్రింట్ స్కానర్
- ధర 899.99 డాలర్లు(భారత్‌లో దాదాపుగా రూ.64,190)
గెలాక్సీ ఎస్ 10 ప్లస్
- 6.4 అంగుళాల క్వాడ్హెచ్డీ ఇన్ఫినిటీ తెర
- 7ఎన్ఎం క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్
- 8జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మొమరీ, 12 జీబీ ర్యామ్, 512 జీబీ, 1టీబీ అంతర్గత మెమొరీ
- ఎస్ 10లో ఉన్న వెనుక కెమెరాలు.. రెండు ముందు కెమెరాలు
- ఇన్డిస్ల్పే ఫింగర్ ప్రింట్ స్కానర్
- 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ చార్జింగ్
- ప్రారంభ ధర 999.99 డాలర్లు (భారత్‌లో దాదాపుగా రూ.71,320)
గెలాక్సీ ఎస్ 10 ఈ
- 5.8 అంగుళాల క్వాడ్హెచ్డీ ఇన్ఫినిటీ తెర
- 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ, 8జీబీ ర్యామ్ 512 అంతర్గత మెమొరీ
- 7ఎన్ఎం క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్
- 12,16 మెగాపిక్సెళ్ల వెనుక కెమెరాలు
- 10 మెగాపిక్సెళ్ల ముందు కెమెరా
- 128, 512 జీబీల అంతర్గత మెమరీ సామర్థ్యం
- వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్
- 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ
- ప్రారంభ ధర 749.99 డాలర్లు (భారత్‌లో దాదాపుగా రూ.53,490)
మార్చి 8 నుంచి ఎస్10 సిరీస్ ఫోన్లు విక్రయాలు మొదలవుతాయి.
Ten years after the first Galaxy, we didn’t just change the shape of the phone, we changed the shape of tomorrow. #GalaxyFold
— Samsung Mobile (@SamsungMobile) February 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Learn more: https://t.co/gYYGF4ZvdJ pic.twitter.com/C8s0Jxdhkz
">Ten years after the first Galaxy, we didn’t just change the shape of the phone, we changed the shape of tomorrow. #GalaxyFold
— Samsung Mobile (@SamsungMobile) February 20, 2019
Learn more: https://t.co/gYYGF4ZvdJ pic.twitter.com/C8s0JxdhkzTen years after the first Galaxy, we didn’t just change the shape of the phone, we changed the shape of tomorrow. #GalaxyFold
— Samsung Mobile (@SamsungMobile) February 20, 2019
Learn more: https://t.co/gYYGF4ZvdJ pic.twitter.com/C8s0Jxdhkz
త్వరలో 5జీ ఫోన్
తన తొలి 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది సామ్సంగ్. వచ్చే వారం బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మిగతా సంస్థలు ప్రకటించేందుకు సిద్ధమౌతున్న తరుణంలో ఎస్10 5జీ మోడల్‌ను ప్రకటించిందీ సంస్థ. అయితే ధర, విడుదల తేదీని ప్రకటించలేదు.
ప్రస్తుత టెక్నాలజీకి ఉన్న హద్దుల్ని చెరిపేందుకు మా సంస్థ ప్రయత్నిస్తోంది. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సామ్సంగ్ కమ్యూనికేషన్స్ ప్రధాన అధికారి డిజె కో తెలిపారు.
స్మార్ట్‌వాచ్‌లు..
ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్, గెలాక్సీ ఫిట్ ట్రాకర్స్, గెలాక్సీ బడ్స్‌ను టెక్ ప్రియులకు పరిచయం చేసింది.
- ఇది చూడండి----->ఫిబ్రవరిలో ఫోన్ల పండగ