ఫ్లిప్కార్ట్ సహస్థాపకుడు సచిన్ బన్సల్ 'ఓలా' క్యాబ్స్లో రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ నిధులతో భారతీయ క్యాబ్ సంస్థైన 'ఓలా' ప్రత్యర్థి సంస్థ ఉబేర్కు గట్టి పోటీ ఇవ్వనుంది.
సంస్థలో ఇంత భారీ మొత్తంలో వ్యక్తిగత పెట్టుబడులున్న ఏకైక వ్యక్తి బన్సల్ మాత్రమే. ఈ ఏడాది జనవరిలోనే సిరిస్ జే ఫండిగ్లో భాగంగా 'ఓలా' రూ.150 కోట్ల విలువైన షేర్లను బన్సల్కు కేటాయించింది.
"భారత్లో అభివృద్ధి చెందుతోన్న వినియోగదారు వ్యాపారాల్లో ఓలా ఒకటి " -సచిన్ బన్సల్, ఫ్లిప్కార్ట్ సహస్థాపకుడు
బిలియన్ డాలర్ల నిధుల సమీకరణలో భాగంగానే ఈ పెట్టుడులు వచ్చినట్లు ఓలా వెల్లడించింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ గత ఏడాది అక్టోబరులో చైనాకు చెందిన టెన్ సెంట్ హోల్డింగ్స్, సాఫ్ట్ బ్యాంకు గ్రూపుల ద్వారా 1.1 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించుకుంది.
ప్రస్తుతం 'ఓలా' భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న ఉబేర్ సంస్థతో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
క్యాబ్ సేవలతో పాటు, ఫుడ్ పాండాతో కలిసి ఫుడ్ డెలివరి సేవలను కూడా 'ఓలా' అందిస్తోంది.