కళ్లకు అద్భుతం తోడైతే..
దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అప్డేటెడ్ వెర్షన్ కలిగిన హోలోలెన్స్ 2ను విడుదల చేసింది. 2016లో వచ్చిన వెర్షన్ కంటే ఇది పరిమాణంలో చిన్నది, తేలికైనది.
దీని ధర 3500 యూఎస్ డాలర్లుగా(భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2 లక్షల 50 వేలు) నిర్ణయించారు. ఈ హోలోలెన్స్లో ప్రత్యేకంగా ఐరిస్ ట్రాకింగ్ సాంకేతికతను పొందుపర్చారు.
అంతకుముందు జనరేషన్లో వీఆర్ హెడ్‌సెట్‌తో తలను తిప్పాల్సి వచ్చేది. ఈ అప్డేటెడ్ హోలోలెన్స్ మీ కళ్లను అనుసరించి కావలిసిన సమాచారాన్ని హైలైట్ చేస్తుంది. ఫలితంగా, వెబ్ పేజ్‌లను సులభంగా స్క్రోల్ చేయొచ్చు
--నికోల్ స్కాట్, మొబైల్ గీక్స్ ఎడిటర్
మరో మడత ఫోన్..
కొన్ని రోజుల క్రితమే మడత ఫోన్లను తెస్తున్నట్లు ప్రకటించింది సామ్సంగ్. ఇప్పుడు ఆ జాబితాలోకి హువావే సంస్థ చేరింది. మేట్ ఎక్స్ ఫోల్డబుల్ ఫోన్‌ను ఈ షోలో ప్రదర్శించింది. ధర 2600 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.లక్ష 85 వేల రూపాయలు). రానున్న రోజుల్లో మడత ఫోన్లే మొబైల్ మార్కెట్లను శాసించనున్నాయనడానికి ఇది ఆరంభం మాత్రమే.
ఫోల్డబుల్ ఫోన్ మేట్ ఎక్స్‌తో ప్రజల్ని ఆకర్షించింది హువావే. తమ ఆధునిక ఉత్పత్తులతో ప్రజలు దీని గురించే మాట్లాడుకునేలా చేసింది
--రోజర్ చెంగ్, సి నెట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
5జి గేమింగ్...
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్ ఆడి ఆడి బోర్ కొట్టిందా. అయితే ఈ సదుపాయం మీ కోసమే. 5జి టెక్నాలజీతో మీ మొబైల్ ఫోన్లలో వర్చువల్ రియాలిటీలో గేమింగ్ అనుభూతిని పొందొచ్చు. ఇలాంటి సదుపాయం కల్పిస్తున్న మొదటి సంస్థ ప్లే గిగా కావడం విశేషం. ప్రస్తుతానికి యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.
ఫైబర్, కేబుల్ నెట్వర్క్లా కాకుండా 5జి గేమింగ్ టెక్నాలజీతో సరికొత్త అనుభూతిని పొందొచ్చు. ఇది ప్రత్యేక సదుపాయాలు కలిగి ఉండి హై క్వాలిటీ విజువల్‌ను అందిస్తుంది--జావిర్ పోలో, ప్లే గిగా సీఈవో