టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. "జియో గ్రూప్ టాక్" యాప్ను ప్రవేశ పెట్టింది. కాన్ఫరెన్స్ కాల్లో ఒకేసారి 10 మందితో మాట్లాడే సదుపాయం కల్పించింది.
పరీక్షల దశలో..
ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యాప్ త్వరలో విడుదల కానుంది. జియో సిమ్ కలిగి ఉన్న మొబైల్ ఫోన్లన్నింటిలో ఇది పనిచేస్తుంది.
ప్రస్తుతం ఈ యాప్లో వాయిస్ కాల్ సదుపాయం ఉంది. రానున్న రోజుల్లో వీడియో కాలింగ్ వస్తుందని సంస్థ తెలిపింది.