పుల్వామా ఆత్మహుతి దాడిలో అమరులైన వారిలో 23 మంది సీఅర్పీఎఫ్ జవాన్లు తమ బ్యాంకులో తీసుకున్న రుణాలను తక్షణమే మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ప్రకటించింది.
అమరులైన జవాన్లంతా తమ జీతాలను ఎస్బీఐ ద్వారా పొందుతూ బ్యాంకు వినియోగదారులైనందున వారందరికి రూ.30 లక్షల బీమా వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
"దేశ రక్షణకు ఎల్లప్పుడు పాటు పడే సైనికుల మరణం చాలా బాధాకరం. ఈ ఘటనలో అమరులైన సైనికుల కుటుబాలకు మేము చేస్తున్న సాయం చాలా చిన్నది" -ఎస్బీఐ ఛైర్మన్ రజినీశ్ కమార్
సాధారణ పౌరులు సైతం తమ చందాలను ఇచ్చేందకు 'భారత్ కే వీర్' పేరిట ప్రత్యేక యూపీఐ ని కూడా బ్యాంకు అందుబాటులో ఉంచింది.
ఆత్మహుతి దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు రెండు పడకల ఇంటిని ఇవ్వనున్నట్లు కన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ప్రకటించింది.
"అమర జవాన్ల కుటుంబాలకు అండగా వారు నివసిస్తోన్న ప్రాంతంలోనే రెండు పడకల ఇంటిని ఇవ్వనున్నాము " - క్రెడాయ్ అధ్యక్షుడు జాక్సీ షాహ్