ETV Bharat / business-news

ఫోర్డ్ అలియాస్​ దాస్​

author img

By

Published : Feb 18, 2019, 10:01 PM IST

ఫోర్డ్​... దిగ్గజ కార్ల తయారీ సంస్థ. అలాంటి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఆల్​ఫ్రెడ్​ ఫోర్డ్​. ఆయనకు మరో పేరుంది. అదే అంబరీశ్​ దాస్​. ఆల్​ఫ్రెడ్​... అంబరీశ్​ ఎలా అయ్యారు? ఆయనకు, కృష్ణుడికి సంబంధమేంటి?

ఫోర్డ్ అలియాస్​ దాస్​

ఆధ్యాత్మికత అద్భుతాలు చేయగలదు. చాలా మంది మనసులకు అంతు చిక్కని ప్రశ్నలకు తుది సమాధానం ఆధ్యాత్మికతే. అందులోని గొప్పతనాన్ని అందరికీ పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇస్కాన్​.

భారత్​లో ఇస్కాన్​కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలాంటి ఇస్కాన్​ స్థాపనలో ఒకరైన హెన్రీ ఫోర్డ్​ మనువడు ఆల్​ఫ్రెడ్​ బ్రష్​ ఫోర్డ్. 1974లో ఆయనకు కృష్ణతత్వం అంటే ఏంటో తెలిసింది. ఆ తర్వాత ఆయన భక్తివేదాంత స్వామి శిష్యుడయ్యారు. తర్వాత హరే కృష్ణ మూమెంట్​లో భాగస్వామి అయ్యారు. అలా అల్​ఫ్రెడ్​ బ్రష్ ఫోర్డ్​... అంబరీశ్​ దాస్​గా మారారు. కృష్ణతత్వం ప్రచారం కోసం కోట్లాది రూపాయలు విరాళంగా ఇస్తున్నారు.

ఛత్తీస్​గఢ్​ రాయపూర్​ ఇస్కాన్​కు వచ్చిన అంబరీశ్​ దాస్​ను ఈటీవీ భారత్ పలకరించింది.

ఫోర్డ్ అలియాస్​ దాస్​
undefined

ప్ర: ఇస్కాన్​కు ఎలా ఆకర్షితులయ్యారు? మీ పేరు, మతం మార్చుకునేలా ఎలా ప్రభావితం అయ్యారు?

జ: కళాశాలలో చదువుకునే రోజుల్లో చాలా ప్రశ్నలు నా మెదడును తొలిచేవి. దేవుడు, విశ్వం గురించి తెలుసుకోవాలని ఉండేది. అప్పటి నుంచి పుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలో కృష్ణ భగవానుడి గురించి తెలుసుకున్నాను. ప్రభావితం అయ్యాను. కృష్ణుడు భగవంతుడు, సృష్టికర్త, సర్వాంతర్యామి.

ప్ర: మీతో పాటు మీ కుటుంబ సభ్యులూ కృష్ణుడ్ని ప్రార్థిస్తారు. మీరు వారిని కోరారా లేక ఇది వారి సొంత నిర్ణయమా?

జ: నా భార్య వైష్ణవ మతస్థురాలు. కుటుంబం మొత్తం ఇస్కాన్​కు, సనాతన ధర్మానికి అంకితం అయ్యాము.

ప్ర: భారత దేశం గురించి మీ అభిప్రాయం ఏంటి?

జ: భారత్​ గొప్ప ఆధ్యాత్మిక దేశం.

ప్ర: ఆధ్యాత్మికత అన్ని సమస్యలకు సమాధానం అంటారా?

జ: ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఇందులో వాదనలు, వివాదాలు సాధారణం. ప్రస్తుత మానవుడు సాధారణ జీవితాన్ని వదిలేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత పూర్తి పరిష్కారం అవుతుందని అనలేం.

ప్ర: భారతీయులకు మీరిచ్చే సందేశం ఏంటి?

జ: ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆధ్యాత్మిక మూలాలను మరువకూడదు. వాటిని కొనసాగించాలి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.