ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ఎఫ్ఎస్) దివాలా సంక్షోభం నేపథ్యంలో అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముంబయి, దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ కేసుకు సంబంధం ఉన్న అధికారుల ఇళ్లలో బుధవారం సోదాలు జరిపి, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది.
చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సీడ్బీ), దాని అనుబంధ సంస్థలకు ఐఎల్ఎఫ్ఎస్ రూ. 91 వేల కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. గతేడాది సెప్టెంబర్లో అనుబంధ సంస్థల దివాలాతో ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం బయటపడింది.