ఉపాధి కోల్పోయే వృద్ధి, గ్రామీణ రుణాల ఊబి, పట్టణ గందరగోళంతో యువత ప్రశాంతంగా లేరని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఉపాధి లేని వృద్ధి ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయే వృద్ధిగా మారిందని దిల్లీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
"రైతు ఆత్మహత్యలు, తరచూ జరుగుతున్న నిరసనలు సంస్థాగత లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. సంపద సృష్టిస్తూ ఉద్యోగాలను కల్పిస్తున్న అవ్యవస్థీకృత రంగం... జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల తీవ్రంగా దెబ్బతినింది. " - మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానమంత్రి.