యోగా గురువు రామ్‌దేవ్ బాబా రాజకీయనాయకులు యోగా సాధన చేయాలని సలహా ఇచ్చారు. యోగా సాధన చేయడం వల్లే నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ ప్రధానులయ్యారని తెలిపారు. ఈ సాధన వారి శక్తిని మరింత పెంచిందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం యోగా అభ్యసిస్తున్నట్లు రామ్‌దేవ్ తెలిపారు. యోగా సాధన రాజకీయ నాయకులకు ఒత్తిడిని తగ్గించే మంత్రమని వెల్లడించారు.
అయితే రాహుల్ గాందీ యోగా సాధన చేయడం వల్ల ప్రధాని అవుతారని చెబుతున్నారా అన్న ప్రశ్నకు మాత్రం నేను ఆ ఉద్దేశంతో అనలేదని బాబా వివరణిచ్చారు.
"నెహ్రూ యోగా సాధన చేసేవారు. ఆయన రాజయోగం బావుండేది. ఇందిరా గాంధీ కూడా యోగా చేసేవారు. అలానే మోదీ యోగా సాధన చేశారు. టీ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయ్యారు. ఆదిత్యనాథ్ యోగా చేశారు, దేశంలోనే పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యారు. రాహుల్ గాంధీ కూడా యోగా సాధన చేస్తున్నారు. ఒత్తిడి పెరిగిపోతోంది. నాయకులందరూ రాజకీయ యుద్ధం చేయడానికి యోగా సాధన చేయాలి." -రామ్‌దేవ్ బాబా, యోగా గురువు