ETV Bharat / bharat-news

పైలట్ విడుదల రేపే! - india

పాకిస్థాన్​ సైన్యం అధీనంలో ఉన్న భారత వాయుసేన వింగ్​ కమాండర్​ను శుక్రవారం స్వదేశానికి అప్పగిస్తామని ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం ప్రకటించింది.

పైలట్​ తిరిగొస్తారా?
author img

By

Published : Feb 28, 2019, 3:12 PM IST

Updated : Feb 28, 2019, 6:02 PM IST

దేశ ప్రజలందరి ఆకాంక్ష ఒకటే... పైలట్​ సురక్షితంగా తిరిగి రావాలని. అందుకోసం భారత్​ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దౌత్యపరంగా పాకిస్థాన్​పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

పైలట్​ను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాజాగా వెల్లడించాయి ప్రభుత్వ వర్గాలు. పాకిస్థాన్​ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయా వర్గాలు ఏం చెప్పాయంటే...

  • పాకిస్థాన్​ సైన్యం అరెస్టు చేసిన వాయుసేన పైలట్​ను దౌత్యపరంగా కలిసేందుకు భారత్​ అనుమతి కోరలేదు
  • పైలట్​ను పాకిస్థాన్​ బేషరతుగా, తక్షణమే విడుదల చేయాలి
  • పైలట్​ విడుదలలో జాప్యాన్ని సహించే ప్రసక్తే లేదు
  • పుల్వామా దాడిపై దర్యాప్తు విషయంలో పాక్​ ప్రధాని మాట నిలబెట్టుకోవాలి
  • ఉగ్రవాదులపై సత్వరమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి

పాకిస్థాన్​ వాయుసేన జెట్​లు బుధవారం భారత గగనతలంలోకి చొరబడటాన్ని తప్పుబట్టాయి ప్రభుత్వ వర్గాలు. పాక్​ జెట్​లు భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించాయని చెప్పాయి. ఈనెల 26 భారత వాయుసేన మాత్రం బాలాకోట్​లోని జైషే మహ్మద్​ ఉగ్రస్థావరాలపైనే దాడి చేసిందని దిల్లీ వర్గాలు గుర్తుచేశాయి.

అందుకు సిద్ధం...
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయంటే... పైలట్​ను భారత్​కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషి అన్నారని ఆ దేశ మీడియా వార్త ప్రసారం చేసింది.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2019, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.